![]() |
![]() |

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 కామన్ మ్యాన్ క్యాటగిరీలో వచ్చి టైటిల్ ని విన్ అయ్యాడు. ఇక తర్వాత సోషల్ మీడియాకి కొంత కాలం బ్రేక్ ఇచ్చాడు. ఐతే ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడూ ఒక్కో ఫోటో పెడుతూ మళ్ళీ తన ఫాన్స్ ని తిరిగి తెచ్చుకునే పనిలో పడ్డాడు. ఐతే రీసెంట్ గా ఒక పిక్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారి. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బ్యాక్ గ్రౌండ్ లో పులి ఫోటో కనిపిస్తుండగా మీసం మెలేస్తూ ఉన్నాడు పల్లవి ప్రశాంత్. పక్కన "కింగ్ సూన్ పల్లవి ప్రశాంత్..జై జవాన్ జై కిసాన్" అని కామెంట్ పెట్టాడు.
ఐతే పల్లవి ప్రశాంత్ హీరోగా త్వరలో అరంగేట్రం చేయబోతున్నాడనే విషయం తెలుస్తోంది. రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో భోలే షావలి కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించాడు. ఐతే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడే చాల మూవీ ఆఫర్స్ వచ్చాయని ఆట బిడ్డతో పాట బిడ్డ కూడా జతకడతాడంటూ చెప్పుకొచ్చాడు. ఐతే పల్లవి ప్రశాంత్ పోస్ట్ చేసిన ఈ పిక్ చూసిన నెటిజన్స్ కొంతమంది ఫైర్ అవుతున్నారు. కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక నెటిజన్ ఐతే "పుష్ప 2 ఒక చిన్న క్యారెక్టర్ ఉందంటగా..నిజమేనా బ్రో" అని అడిగారు. "ఎంఎల్ఏగా పోటీ చెయ్యి సక్సెస్ అవుతావు...బిగ్ బాస్ కింగ్...హీరో మెటీరియల్ అన్నా నువ్వు...ప్రతి ఒకరికి తెలుసు విన్ ఇయ్యక మనీ ఎప్పుడు అప్పుడే రావు అని ఐనా కావాలనే ఇట్లా పైసల్ పైసల్ అని మాట్లాడతారు 100 రూపాయలు పోతేనే ఆగం ఇతం మనం అలాంటింది 50 లక్షలు ఇస్తా అన్నాడు..ఆ మాట అనడం గొప్ప అండ్ చేసి కూడా చూపిస్తాడు మా అన్న హేటర్స్ గెట్ రెడీ...రైతులకు ఇస్తాను అన్న డబ్బు ఎం చేసావో తెలుసుకోవచ్చా... అన్నా నువ్వు హీరోవి" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ జర్నీనే ఒక మూవీగా రాబోతోందా అనే డౌట్ కూడా ఆడియన్స్ లో లేకపోలేదు. చూడాలి ఇంతకు ఆ సినిమా ఏమిటి పల్లవి ప్రశాంత్ రోల్ ఏమిటి అనేది.
![]() |
![]() |